ఎంపీ కంగనా రనౌత్ ను కొట్టిన సీఐఎఫ్ జవాన్.. ఎందుకో తెలిస్తే షాక్!

ఎంపీ కంగనా రనౌత్ ను కొట్టిన సీఐఎఫ్ జవాన్.. ఎందుకో తెలిస్తే షాక్!

న్యూఢిల్లీ: చండీగఢ్ విమానాశ్రయంలో బాలీవుడ్ నటి, మండి ఎంపీ, బీజేపీ నాయకురాలు కంగనా రనౌత్ ను ఒక మహిళా సీఐఎస్ఎఫ్ (CISF) జవాన్ చెప్పుతో కొట్టింది. భద్రతా తనిఖీల తర్వాత రనౌత్ విమానం ఎక్కుతున్న సమయంలో సీఐఎస్ఎఫ్ చండీగఢ్ యూనిట్ జవాన్ కుల్విందర్ కౌర్ ఆమెను కొట్టడం సంచలనమయ్యింది. వివరాల్లోకి వెళితే... ఇటీవల ముగిసిన ఎన్నికల్లో మండి లోక్ సభ స్థానం నుంచి కంగనా రనౌత్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ వారాంతంలో జరిగే కొత్త మంత్రివర్గ ప్రమాణ స్వీకారం కోసం ఆమె ఢిల్లీకి బయల్దేరారు. మొహాలీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ఆమె చేరుకున్నారు. తనిఖీల సమయంలో ఆమెను పరీక్షించిన సీఐఎస్ఎఫ్ లేడీ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టింది. ఈ సందర్భంగా రనౌత్ తో కలిసి ప్రయాణిస్తున్న మయాంక్ మధుర్ కౌర్ ను కూడా చెంపదెబ్బ కొట్టేందుకు ప్రయత్నించాడు.

CISF కానిస్టేబుల్ కంగనా రనౌత్‌ని ఎందుకు చెప్పుతో కొట్టింది?

మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో రనౌత్ "డబ్బుల కోసం రాష్ట్ర మహిళలు రైతుల ఆందోళనలో పాల్గొన్నారు" అని పంజాబ్‌లో మహిళల గురించి అవమానకరంగా మాట్లాడినందుకు కౌర్ కంగనాను చెంపదెబ్బ కొట్టిందని మొహాలీ అంతర్జాతీయ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి.దీనిపై ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ)కి ఫిర్యాదు చేయనున్నట్లు కంగనా తెలిపారు. బీజేపీ మండి ఎంపీ విమానం సాయంత్రం 4:10 గంటలకు బయలుదేరింది. లేడీ కానిస్టేబుల్ కౌర్ CISF కమాండెంట్ ముందు హాజరయ్యాడు. తదుపరి విచారణ కోసం సీనియర్ CISF అధికారులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం.